చీపురుపల్లి: నెల రోజుల పాటు ర్యాలీలు, సభలు బంద్

చీపురుపల్లి సబ్‌డివిజన్‌లో జూలై 11 నుంచి ఆగస్టు 10 వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించవద్దని డీఎస్పీ ఎస్. రాఘవులు తెలిపారు. ప్రజలు గుంపులుగా చేరకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. అనుమతి లేకుండా రోడ్ షోలు, సమావేశాలు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్