అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందిస్తున్నామని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు తెలిపారు. శుక్రవారం పెనుబర్తి గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం వితంతువుల పట్ల నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ప్రస్తుతం ఎన్డీయే నేతలు లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లు అందజేస్తున్నారని పేర్కొన్నారు.