చీపురుపల్లి: స్క్రబ్ టైఫస్ వ్యాధితో మహిళ మృతి

విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండ‌టం ఆందోళన కలిగిస్తోంది. చీపురుపల్లి మండలంలోని మెట్టపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి (40) ఈ వ్యాధి లక్షణాలతో విజయనగరం‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ నవంబర్ 29న మరణించారు. జిల్లాలో కొత్త కేసులు బయటపడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నల్లిలాంటి చిన్న పురుగు కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్