పాలకొండలో జరిగిన మహానాడు కార్యక్రమంలో టీడీపీలో వర్గపోరు బయటపడింది. సీనియర్ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భూదేవిపై పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం 32 పంచాయతీలకు చెందిన సుమారు 1500 మంది కార్యకర్తలు యాలాం జంక్షన్ నుంచి కోట దుర్గమ్మ ఆలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. భూదేవిని వెంటనే ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొలగించాలని మంత్రి అచ్చెన్నాయుడిని వారు కోరారు.