నేడు సంక్షేమ కార్యక్రమాలకు సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయనగరం జిల్లాలో పర్యటించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం రావివలస హెలిప్యాడ్‌కు చేరుకుని, చీపురుపల్లి సీహెచ్‌సీలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని, పైలపేటలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. అధికారులు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్