చీపురుపల్లిలోని శ్రీ గాయత్రి కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ రాఘవులు, సీఐ శంకర్, ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ గాయకుడు శంకర్ రావు హాజరయ్యారు. కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో పాటు క్రమశిక్షణతో ఉంటారని అతిథులు కొనియాడారు. ఇతర కళాశాలల కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపకులను, ప్రిన్సిపాల్‌ను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి.