విజయనగరంలోని బాబా ఖాదర్ మసీదును శుక్రవారం గజపతినగరం మాజీ శాసనసభ్యుడు బొత్స అప్పల నరసయ్య సందర్శించారు. బాబా మెట్టలో హజరత్ సయ్యద్ షాహిన్ షా బాబా ఖాదర్ వలి 67వ సుగంధ మహోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి సమస్యలు ఎదురుకాకూడదని ప్రార్థించినట్లు తెలిపారు.