శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో రూ. 2.42 లక్షల ఆదాయం

చీపురుపల్లిలోని శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుండి బుధవారం రూ. 2,42,060 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఎస్.నానాజీ బాబు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 10, 2005 నుండి ఫిబ్రవరి 4, 2006 వరకు అమ్మవారి హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దేవాదాయ తనిఖీదారు జి.శ్యాంప్రసాద్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది.

సంబంధిత పోస్ట్