వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకాలు: యువజన విభాగంలో కొత్త బాధ్యతలు

విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో కీలక నియామకాలు జరిగాయి. చీపురుపల్లి మండలం పేరిపి గ్రామానికి చెందిన సర్పంచ్ కోరాడ పృథ్విరాజ(భాగ్యరాజ్)ను జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా, పీ.కే. పాలవలస గ్రామానికి చెందిన వైయస్సార్ పార్టీ నాయకులు రెల్లి శివను చీపురుపల్లి మండల యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. యస్. జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుండి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్త బాధ్యతలు చేపట్టిన కోరాడ పృథ్వి, రెల్లి శివ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్