విజయనగరం, చీపురుపల్లి: స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన ‘చదవడం అంటే మాకిష్టం’ కార్యక్రమంలో మెరకముడిదాం లైబ్రేరియన్ బుచ్చి నాయుడు పాల్గొన్నారు. పిల్లలకు కథల పుస్తకాలు చదివించి, పుస్తక పఠనం ద్వారా జ్ఞానం వృద్ధి చెందుతుందని ఆయన వివరించారు. పుస్తకాలు చదవడం పట్ల అభిలాష కలిగి ఉండాలని ఆయన పిల్లలకు సూచించారు.