రాజాం మండలం గెడ్డవలసలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుతో ముగ్గురు మహిళలు మృతి చెందారు. పొలంలో దొండకాయలు ఏరుతున్న సమయంలో ఆకస్మికంగా కురిసిన గాలివానతో పాటు పిడుగు పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోడికోడళ్లు ఉండటంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.