చీపురుపల్లి మండలం పీకే పాలవలస పంచాయతీలో డా. బొత్స అనూష ఆధ్వర్యంలో ఆదివారం ‘మన కార్యకర్త–మన కుటుంబం 2.0’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్యకర్తలు పార్టీకి బలమని, గ్రామ స్థాయి కమిటీలతో క్యాడర్ బలోపేతం అవుతుందని తెలిపారు. జగన్‌ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అనూష హామీ ఇచ్చారు. కూటమి పాలనపై విమర్శలు చేశారు.