ఆశా సమస్యల పరిష్కార వేదికను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఎస్. భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. జిల్లా కేంద్రంలో ఎన్జీఓ హోం లో గురువారం నిర్వహించిన ఆశా గ్రీవెన్స్ కు ప్రతీ పిహెచ్సీ నుండి ఒక ఆశా కార్యకర్త ప్రతినిధిగా హాజరయ్యారు. వారి సమస్యలను గ్రీవెన్స్ లో ప్రస్తావించి ఫిర్యాదులను డిఎంహెచ్ఓ కు అందజేశారు. ఆశ జాబ్ చార్ట్ మేరకు విధులు అమలయ్యేలా ఉండాలని పలు సమస్యలను నివేదించారు.