చీపురుపల్లి నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో గరివిడి మండలం కాపుశంభాం పరిధిలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సర్వే నంబర్-1లోని 26.05 ఎకరాల డీ-పట్టా భూమిని ప్రాథమికంగా గుర్తించారు. అధికారులు భూములను పరిశీలించి, పరిశ్రమల స్థాపనకు అనుకూలమని నిర్ధారించారు. 12 మంది డీ-పట్టాదారుల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూములను కొనుగోలు చేసి, సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు.