వైస్సార్ పార్టీ ప్రచారవిభాగం కీలక పాత్ర పోషించాలి: కాకుమాను రాజశేఖర్

విశాఖపట్నం జిల్లా వైస్సార్ పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రచారవిభాగం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ, వైస్సార్ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన ఏ కార్యక్రమానికైనా ప్రచారవిభాగం కీలక పాత్ర పోషించాలని, పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలని పిలుపునిచ్చారు. 19 నెలల కూటమి పాలన అబద్దాలు, హత్యలు, హత్యాచారాలు, దౌర్జన్యాలతో సాగుతోందని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అడుగు అడుగునా జరుగుతున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని, కార్యకర్తలకే తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ప్రచారవిభాగం నాయకులు విశ్రమించకుండా పనిచేసి వైస్సార్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు.

సంబంధిత పోస్ట్