విజయనగరం: పాపం..ఈ తండ్రి కష్టం ఇంకెవరికి రావద్దు

ముగ్గురు కొడుకులున్నా రోడ్డుపై బతుకున్న ఓ తండ్రి గాథ ఇది. రాజాం మెహర్ బాబాకాలనీలో పిల్లా సన్యాసిరావు అనే 80ఏళ్ల వృద్ధుడు ఆరుబయటే నిద్రిస్తూ పింఛన్ డబ్బులతో ఆకలి తీర్చుకుంటున్నాడు. 20ఏళ్ల క్రితం కాకినాడ నుంచి వచ్చి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య మూడేళ్ల క్రితం మరణించగా రెండు నెలల క్రితం ఉద్యోగం పోయింది. తాను ఇంట్లో ఉంటే నా కొడుకుని వదిలేస్తానని కోడలు అంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్