బొండపల్లి మండలం గొట్లాం గ్రామ పంచాయతీ కు చెందిన ఐదుగురు యువకులు, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. గ్రామానికి చెందిన తాళ్లపూడి జగదీష్, కోరడ సురేష్, మజ్జి జగదీష్ పొట్నూరు గురుమూర్తి కోరాడ కుమార్( వెంకటేష్ ) కానిస్టేబుల్ ఉద్యోగాలు, సాధించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు ఉద్యోగాలు సాదించడంతో గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు.