బొండపల్లి: రైలు కింద పడి యువకుడు మృతి

బొండపల్లిలోని దావాలపేట సమీపంలో గురువారం రైలు కింద పడి నడిపల్లి వెంకటేశ్ (23) అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు గజపతినగరం (M) తుమ్మికాపల్లికి చెందినవాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఆత్మహత్యగా భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్