మెంటాడలో లేగదూడల ప్రదర్శన, రైతులకు అవగాహన

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మెంటాడ గ్రామంలో మంగళవారం రాష్ట్రీయ గోకుల్ మిషన్ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో పుట్టిన దూడల నుంచి సంవత్సరం లోపు వయస్సు గల 50 దూడలు ప్రదర్శనకు వచ్చాయి. ఈ సందర్భంగా దూడలకు నులి పురుగుల మందు పట్టించారు. మెంటాడ పశు వైద్యధికారి డా. సతీష్ కుమార్ రైతులకు దూడల పెంపకంపై అవగాహన కల్పించారు. రైతులకు ప్రోత్సాహకంగా బహుమతులు కూడా అందజేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్