బాల్యవివాహాల నివారణకు సమాజ సహకారం అవసరం

గజపతినగరం ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు శకుంతల, ఎన్జీవో బెజ్జి టీం సభ్యుడు శివశంకర్ బాల్యవివాహాల నిర్మూలనకు సమాజం బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సీడీపీవో రాజేశ్వరి ఆదేశాల మేరకు గజపతినగరం, పురిటిపెంట గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. బాల్యవివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని, చట్టపరమైన శిక్షలు, సామాజిక దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించి, ఇలాంటి వివాహాలను అడ్డుకోవడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్