దత్తిరాజేరు మండలంలోని ఎం లింగాలవలస గ్రామంలో సీనియర్ నాయకులు, గ్రామ సర్పంచ్ మజ్జి అప్పలనాయుడు కుటుంబాన్ని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య బుధవారం పరామర్శించారు. ఇటీవల అప్పలనాయుడు అనారోగ్యానికి గురి కావడంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అప్పలనరసయ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు.