ప్రభుత్వ బడిలో చేర్పించండి: ఉప విద్యాశాఖ అధికారి

పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మున్సిపాలిటీలో జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బి. రాజకుమార్ ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని, అయితే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్