విజయనగరం జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం, 13వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా గజపతినగరం, ఎస్. కోట, విజయనగరం, రాజాంలలో మొత్తం ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1205 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 53 మంది ఇన్విజిలేటర్లు, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు విధుల్లో ఉంటారు. కేంద్రాల్లో వెలుతురు, గాలి, ఫర్నీచర్ సదుపాయాలు కల్పించారు. సెల్‌ఫోన్లకు అనుమతి లేదు.