గజపతినగరం మండలంలోని పిడిశీల గ్రామంలో గురువారం జరిగిన అవగాహన సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ప్రాముఖ్యతను వివరించారు. నవధాన్యాలు, ఫ్రీ మాన్‌సూన్ డ్రై సోయింగ్ విధానాల ద్వారా నేల సారవంతత పెరిగి, పంటల దిగుబడులు మెరుగుపడతాయని, తద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వస్తాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు నవధాన్యాల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.