దత్తిరాజేరు మండలంలోని పెదకాద గ్రామానికి చెందిన జనసేన మండల సీనియర్ నేత సామి రెడ్డి లక్ష్మణ ఆధ్వర్యంలో 35 కుటుంబాలు బుధవారం వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య తన స్వగృహంలో కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో పాటు జనసేనలో ప్రాధాన్యత లేకపోవడంతో పార్టీని వీడామన్నారు. మాజీఉపసర్పంచ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.