విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మర్రివలస ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కనకల చంద్రరావుకు ఆదివారం బాపట్ల లో వ్యాస మహర్షి పురస్కారాన్ని కార్యక్రమ నిర్వాహకులు జాతీయ హిందూ ఉపాధ్యాయ సమితి శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి పూజ్యశ్రీ శివ స్వామి చేతుల మీదుగా అందుకున్నారు. విలువలతో కూడిన విద్యను అందిస్తున్నందుకు ఉపాధ్యాయులు చంద్రరావును పలువురు ప్రశంసించారు.