మధ్యవర్తిత్వంతో కక్షిదారులకు సమయం డబ్బు ఆదా అవుతుందని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం గజపతినగరం కోర్టు ఆవరణలో మధ్యవర్తిత్వంపై అవగాహన సదస్సు జరిగింది. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే కోర్టులో ఫిర్యాదు చేస్తే కోర్టు ద్వారా నియమితులైన మధ్యవర్తిత్తులు ఇరువర్గాల అంగీకారం మేరకు పరిష్కారం జరుగుతాయన్నారు. మధ్యవర్తిత్వంపై సమాచారం త్వరలో తెలుపుతామన్నారు.