కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం గంట్యాడ మండలంలోని కొండతామరాపల్లి జంక్షన్ లో వైసీపీ మండల స్థాయి విస్తృత సమావేశం జరిగింది. మోసపూరిత వాగ్దానాలతో చంద్రబాబు అధికారం చేపట్టారని ఆరోపించారు. జగన్ ఆదేశాల మేరకు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.