మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ సిబ్బంది అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య గురువారం గజపతినగరం పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ కిరణ్ కుమార్ నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.