అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం, గజపతినగరం జిల్లాలోని గంట్యాడ మండల కేంద్రంలో సోమవారం 'అంగన్వాడీ పిలుస్తోంది' అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. గంట్యాడ ఐసిడిఎస్ సిడిపిఓ ఉమాభారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో కూడిన ఆహ్లాదకరమైన విద్యను అందిస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్