తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగిందని సిట్ నివేదిక స్పష్టం చేసిందని, ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోందని జనసేన పార్టీ పీఏసీ సభ్యురాలు పడాల అరుణ గురువారం తన స్వగృహంలో మీడియాతో అన్నారు. కల్తీ జరగలేదని అప్పట్లో వైసీపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించారని, ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం పాపానికి ఒడిగట్టిందని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా పాల్గొన్నారు.