గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు నైతిక విలువలు పెంపొందించుకున్నప్పుడే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అన్నారు. శనివారం స్ట్రీట్ చిల్డ్రన్స్ డే సందర్భంగా బొండపల్లి మండలంలోని ఓంపల్లి గ్రామంలోని శాంతి నివాస్ అనాధాశ్రమంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు కూడా పాల్గొన్నారు.