గజపతినగరంలో నూతనంగా నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ సోమవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఈ నూతన ఆసుపత్రి గజపతినగరం నియోజకవర్గం, గజపతినగరం మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించనుంది.