మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

గజపతినగరం మండలంలోని పురిటిపెంట న్యూకాలనీలో గల టిడిపి మాజీ మండల అధ్యక్షుడు అట్టాడ లక్ష్మ నాయుడు ఇంటివద్ద గురువారం నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కేఏ నాయుడు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. మాజీ జెడ్పిటిసి బండారు బాలాజీ, లక్ష్మనాయుడు, వేమలి చైతన్యబాబు, వర్మ రాజు తదితరులు డాక్టర్ నాయుడుకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్