లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన పంచాయతీ రాజ్ అధికారులు

విజయనగరం జిల్లా గజపతినగరం పంచాయతీ రాజ్ కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులకు పంచాయతీ రాజ్ శాఖ జూనియర్ ఇంజనీర్ పల్లి గౌతమ్ నాయుడు, వర్క్ ఇన్స్పెక్టర్ పెద్దిరెడ్ల సంతోష్ లు లక్షా 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మెంటాడ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి సర్పంచ్ రాంబాబు వద్ద నుంచి లక్షా యాభై వేలు డిమాండ్ చేయగా, లక్షా 20 వేలకు బేరం కుదిరింది. ఈ క్రమంలో డబ్బులు తీసుకుంటుండగా అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు నిందితుల నుంచి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్