గజపతినగరం మండలంలోని జిన్నాం గ్రామంలో లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సమయానికి పెన్షన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, కొండపల్లి భాస్కరనాయుడు తదితరులు పాల్గొన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో ఈ పంపిణీ జరిగింది.