దత్తిరాజేరు మండలం పెదకాదలో జనసేన పార్టీకి చెందిన 35 కుటుంబాలు గురువారం వైసీపీలో చేరాయి. కూటమి పాలనపై అసంతృప్తితో పాటు జనసేనకు స్థానికంగా సరైన ఆదరణ లేకపోవడం వల్ల సీనియర్ నేత సామిరెడ్డి లక్ష్మణతో కలిసి వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య వారిని పార్టీ కండువాలతో స్వాగతించారు.