క్యూబాకు సీపీఎం సంఘీభావం.. రూ.5000 విరాళాల సేకరణ

ఆర్థికంగా విరాళాలు ఇచ్చి క్యూబాకు సంఘీభావంగా నిలవాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి. శ్రీనివాస్ కోరారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గజపతినగరం కేంద్రంలో సంఘీభావ నిధిగా 5000 రూపాయలు సేకరించారు. శ్రీనివాస్, దాసరి సింహాద్రి బృందంగా ఏర్పడి పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, ఆఫీసులలో, వివిధ షాపుల వద్ద వసూలు చేశారు. నిధికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్