మెంటాడ మండలం ఉయ్యాడవలస గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి గోకుల కృష్ణ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం బుధవారం జరిగింది. గ్రామంలో సభ పెట్టి రైతులకు మొక్క జొన్న, కందులు, పత్తి పంటల సస్య రక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులను వివరించారు. వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటలు సాగు చేయడం వలన అధిక దిగుబడులు పొందవచ్చని అన్నారు.