ప్రతి ఇంట్లో గోవు ఉండాలి: విశ్వహిందూ పరిషత్

మెంటాడ మండల కేంద్రంలో శుక్రవారం గోపాష్టమి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోవుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ మూడు జిల్లాల కార్యదర్శి కాళ్ల నాగభూషణరావు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో గోవు ఉండాలని విజ్ఞప్తి చేశారు. గోమూత్రం, పేడ ఆరోగ్య ప్రదాయని అని, గతంలో గోవు ఆధారిత జీవనం జరిగేదని ఆయన తెలిపారు. అనంతరం గోవుతో తిరు వీధి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో, భజనలతో నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్