సీడ్ క్యాపిటల్ లబ్ధిదారులకు ఆదాయ వృద్ధిపై శిక్షణ

గజపతినగరం మండల సమాఖ్య కార్యాలయంలో సీడ్ క్యాపిటల్ లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా డీపీఎం లక్ష్మనాయుడు మాట్లాడుతూ సీడ్ క్యాపిటల్ తీసుకున్న సభ్యులు ఆహార ఉత్పత్తి కార్యక్రమాలను చేతులతోనే కాకుండా, యంత్రాల సహాయంతో భారీ స్థాయిలో చేపట్టి ఆదాయం సంపాదించాలని సూచించారు. యంత్రాల కొనుగోలుకు పీఎంఎఫ్ఎంఐ రుణాల ద్వారా బ్యాంకుల సహకారంతో రుణాలు పొంది, ఈ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించి కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం నారాయణరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్