పద్మనాభం మండలంలో ఆదివారం ఇద్దరు కార్మికులు హెచ్‌టీ విద్యుత్ లైన్ తగిలి మృతి చెందారు. జగనన్న కాలనీలో రేకుల షెడ్డు ఏర్పాటు పనులు చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. డెంకాడ మండలం గుండాలపేటకు చెందిన తాపీమేస్త్రీ కంటుబోతు శ్రీను (40) మరియు కె. సూరీడు (60) విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.