జయతి గ్రామంలో శిథిలావస్థలో దుర్గమ్మ తల్లి గద్దె

మెంటాడ మండలం జయతి గ్రామంలో గ్రామ దేవత దుర్గమ్మ తల్లి గద్దె శిథిలావస్థకు చేరుకుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే అమ్మవారి పండగ సమయంలో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. గద్దె కూలిపోయే ప్రమాదం ఉందని, దర్శనానికి వెళ్ళాలంటే భయపడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలమైన గద్దెను పునర్నిర్మించాలని వారు అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్