VZM: పొట్టకూటి కోసం వెళ్తూ.. మృత్యవాత

తూ.గో. జిల్లా దేవరపల్లి(M) ఎర్నగూడెం హైవే ఫ్లైఓవర్‌పై శనివారం తెల్లవారుజామున లారీ పైనుంచి జారిపడి విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. గజపతినగరం(M) పాతబగ్గానికి చెందిన పల్లి ప్రసాద్ (24) మరి కొంత మందితో కలిసి కృష్ణాజిల్లా గుడివాడలో మినప చేలు తీత కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. నిద్ర మత్తులో ఉండగా లారీ వెనక డోర్ పైనుంచి జారిపడి తలకు దెబ్బ తగిలి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్