గంట్యాడ మండలం మోకాలుపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి గడపపై నిద్రిస్తున్న గుణశెట్టి లక్ష్మి అనే మహిళ, ఈ నెల 20న రాత్రి పాముకాటుకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.