మనస్తాపంతో యువకుడి మృతి

గంట్యాడ మండలం మదుపాడ గ్రామంలో నోట్ల అచ్చంనాయుడు (29) అనే యువకుడు మనస్తాపంతో పురుగుమందు తాగి మృతిచెందాడు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చిన అచ్చంనాయుడు, అక్కడ అలవాటైన వ్యసనాల కారణంగా ఇంటి డబ్బులు ఖర్చు చేయడంతో పాటు బంగారం విక్రయించి మద్యం సేవించేవాడని ఏఎస్‌ఐ రమణ తెలిపారు. ఈ విషయంపై తండ్రి ప్రశ్నించడంతో మనస్తాపానికి గురైన అచ్చంనాయుడు శుక్రవారం రాత్రి పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ, శనివారం ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్