అమరావతి అభివృద్ధికి అన్ని పార్టీల మద్దతు: ఎమ్మెల్యే బోనెలా

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంటులో అన్ని పార్టీలు మద్దతు తెలపడం రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, అమరావతి 26 జిల్లాలకు ఉపాధి, ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, మూడు రాజధానుల వివాదానికి ముగింపు పలికే దిశగా ఇది కీలకమని పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించడం ప్రతి నాయకుడి బాధ్యత అని, భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి, విశాఖను ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్