చినకేర్జల వద్ద ఆటో బోల్తా.. ఒకరికి తీవ్ర గాయాలు

కొమరాడ మండలం చినకేర్జల గ్రామ సమీపంలో మంగళవారం ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. సంకేసు గ్రామం నుంచి ఒడిశాలోని అలమండ గ్రామం వైపు వెళుతుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్