భామిని: ఘాట్ రోడ్డు లో ఆటో బోల్తా

భామిని మండలం బండ్రసింగి ఘాటీ రోడ్డులో ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. భామినిలో గురువారం వారపు సంతకు కురుపాం మండలం ఆవిరి గ్రామానికి చెందిన ఏడుగురు ఆటోలో బయలుదేరారు. ఘాటీ రోడ్డులో అదుపు తప్పి ఆటో లోయలో పడటంతో ఘటనా స్థలంలో కొండగొర్రి ఎల్లంగు (52) మృతి చెందాడు. ఆటో డ్రైవర్తో పాటు మిగతా వారంతా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై బత్తిలి ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్