భక్తిశ్రద్ధలతో చినశంబర జాతర ముగింపు

గరుగుబిల్లి మండలం మరుపెంటలో చినశంబర జాతర బుధవారంతో ముగిసింది. ఈ నెల 26న ప్రారంభమైన మూడు రోజుల జాతరలో చివరి రోజు అనుపోత్సవం సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్‌ఐ ఫకృద్ధీన్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్